12-10-2025 05:03:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం పొందిన విద్యార్థుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు శంభు అన్నారు. రెండు సంవత్సరాల నుంచి బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థుల పిల్లలను బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.