12-10-2025 05:05:21 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం మంచిర్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భావండ్లపల్లి భరత్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ జెడ్పిటిసి కారుకూరి రామ్ చందర్, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తొంగల మల్లేష్ ల ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాడి మహేష్, ముత్తె భూమన్న, దూడ మహేష్, ముక్త రాజన్న, ధరణి సత్యనారాయణ, ముత్తె మురళి, ఆగిరి భీమరాజు, కనుకుంట్ల రాజేష్, శివాజీ వర్మ, బాబండ్ల రాకేష్, మారపాక వంశీ, బండిపెళ్లిశ్యామ్, చిలువుల వెంకటస్వామి, కృష్ణ పల్లి మనోహర్, చీమల సురేష్, నవీన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.