25-07-2025 02:36:50 PM
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్
చండూరు,(మర్రిగూడ),(విజయక్రాంతి): రాష్ట్రంలోని పెండింగ్(Pending projects) ప్రాజెక్టులన్నిటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు తీగల సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మర్రిగూడ మండల(Marriguda Mandal) కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు) మునుగోడు నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభ సభకు కర్నాటిమల్లేశం అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే పెండింగ్లో ఉన్న రిజర్వాయర్లను లింకు కెనాల్ ద్వారా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చేముందు పెండింగ్ ప్రాజెక్టులన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
శివన్నగూడ రిజర్వాయర్, కిష్టారాంపల్లి ప్రాజెక్టులే కాకుండా ఈ మునుగోడు ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే వరకు ఐక్య పోరాటాలు కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ముంపునకు గురైన రైతంగానికి 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతాంగానికి ఇచ్చిన హామీలలో రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని రైతు భరోసాను ఎకరానికి పంటకురూ. 7500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, గత వానాకాలం అసలే ఇవ్వలేదని యాసంగిలో నాలుగు ఎకరాల లోపు వారికి ఇచ్చారని ఆయన అన్నారు. రైతులు పండించిన పంటలకు కరువులు, వరదలు, అకాల వర్షాలు చీడ పీడలు వచ్చిన సందర్భంలో పంట నష్టం జరిగితే పంటల భీమా పథకం అమలు చేయలేదని అన్నారు. కౌలు రైతులు 30% పైగా వ్యవసాయం చేస్తున్నారని వీరికి 2011 చట్టం ప్రకారం రుణ అర్హతకార్డులు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రుణ అర్హత కార్డులు ఉంటే కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలయ్యే అవకాశం ఉంటుందని, రైతు బీమా సౌకర్యం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వారు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతులే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన6 పంటలకు బోనస్ ఇస్తానని హామీ ఇచ్చారని, కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. ఈ శిక్షణా తరగతుల ప్రిన్సిపాల్ గా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, నాంపల్లి చంద్రమౌళి, మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, దామెరలక్ష్మి, ఎఫ్ ఎస్ సిఎస్ డైరెక్టర్ అచ్చిన శ్రీనివాస్ , కర్నాటి సుధాకర్, వేముల లింగస్వామి, యాసరాణి శ్రీను, కర్నాటి వెంకటేశం, నీలకంఠం రాములు,వల్లూరి శ్రీశైలం, రామలింగ చారి, , కొమ్ము లక్ష్మయ్య,ఈరటి వెంకటయ్య, టేకుమెట్ల కృష్ణ, పడసబోయిన యాదగిరి, బొమ్మరగోని నరసింహం, బండారు కృష్ణయ్య, దుబ్బాక రాములు, రాఘవేంద్ర, వెంకటయ్య, కొట్టం యాదయ్య,తదితరులు పాల్గొన్నారు