calender_icon.png 26 July, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు

26-07-2025 10:12:08 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS Huzurabad MLA Padi Kaushik Reddy) ఇంటి వద్ద శనివారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై ఎన్ఎస్ యూఐ నేతలు దాడి చేస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం నాడు కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Chief Minister Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎంపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేతలు భారీగా ఆయన నివాసానికి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి.. రాత్రి 2 గంటలకు మై హోమ్ భుజాలో ఏ హీరోయిన్ దగ్గరకి పోతున్నావో అందరికి తెలుసు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.