26-07-2025 08:29:14 AM
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం(Choutuppal Mandal) భైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం అదుపుతప్పడంతో డివైడర్ ను ఢీకొట్టి పక్క రోడ్డుపై పడింది. పక్క రోడ్డుపై పడిన కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కి చెందిన ఇద్దరు డీఎస్సీలు చక్రధర్ రావు, శాంతారావు మృతి చెందారు. వీళ్లు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, కానిస్టేబుల్ నర్సింగరావు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నర్సింగరావును ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. కేసు విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.