26-07-2025 09:25:12 AM
షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్(Shadnagar) పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో పట్టణానికి చెందిన మచ్చేందర్ అతని కూతురు మైత్రి మృతి చెందారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం చూసి అందరిని కన్నీరు పెట్టించింది. మైత్రికి వస్తున్న తన స్నేహితురాల ఫోన్లో ఇతరుల ఫోన్లకు తయ్యబ్ అనే వ్యక్తి సమాచారం తెలియజేశారు.
లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పట్టణ సీఐ విజయ్ కుమార్ ను రోడ్డు ప్రమాదం గురించి ఆరా తీయగా తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారని సిఐ తెలిపారు. మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ లో ని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి పంపించేందుకు బస్టాండుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు ఇద్దరు మృతి చెందడంతో అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద దృశ్యాల ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.