calender_icon.png 26 July, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు డీఎస్పీల మృతి పట్ల హోంమంత్రి దిగ్భ్రాంతి

26-07-2025 10:42:57 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. ప్రమాదంలో గాయపడిన అడిషనల్ ఎస్పీ  ప్రసాద్,  డ్రైవర్ నర్సింగరావుని ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పిన మంత్రి అనిత వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు(Two DSPs) మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న వాహనం వెనుక నుండి అతివేగంగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. మరణించిన అధికారులను డీఎస్పీలు చక్రధరరావు, శాంతరావుగా గుర్తించారు. అదనపు ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి(Kamineni Hospitals) తరలించారు. ఖైరతాబాద్ లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో  టెస్ట్ కు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తర్ఫీదులో భాగంగా తరుచూ పర్ఫార్మెన్స్ టెస్టుల్లో డీఎస్సీలు పాల్గొంటున్నారు.  గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏఎస్పీ దుర్గాప్రసాద్ కు పక్కటెముకలు, కాలు ఫ్రాక్చర్ అయినట్లు వెల్లడించారు. డ్రైవర్ నర్సింగరావు భుజం ఫ్రాక్చర్ అయినట్లు చెప్పారు. డ్రైవర్ పక్కన కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో దుర్గాప్రసాద్ కు ప్రాణపాయం తప్పింది.