26-07-2025 10:47:17 AM
మద్నూర్(విజయక్రాంతి): వర్షాకాలం అయినందున గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మద్నూర్ ఎస్సై విజయ్ కొండ(SI Vijay Konda) సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ అవసరం అయితే తప్ప బయటకు రావద్దని, రైతులు పొలాల దగ్గరకి వెళ్ళినప్పుడు కరెంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురుస్తుoదున విద్యుత్ స్తంభాలు, వైర్లకు తాకకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు.వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు, వాగుల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు.