26-07-2025 08:16:18 AM
మండల వైద్యాధికారి నగేష్ నాయక్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రస్తుత వర్షాకాలం దృష్యా సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలే అవకాశం ఉన్నందున విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉంటూ, అవగాహన కలిగి ఉంటే సీజనల్ వ్యాధులను నివారించవచ్చునని మండల వైద్యాధికారి భూక్య నగేష్ నాయక్,సీహెచ్ఓ బిచ్చు నాయక్ లు హెచ్చరించారు.శుక్రవారం మండల పరిధిలోని కొమ్మాల జడ్పీహెచ్ఎస్ లో కీటక జనిత,కలుషిత ఆహారం మరియు నీటి ద్వారా వచ్చే వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం కాచి చల్లార్చి వడబోసిన నీటినే త్రాగాలని, త్రాగునీటి వనరులన్నీ తప్పక క్లోరిషన్ చేసుకోవాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,నిలువ ఆహార పదార్థాలను,కుళ్ళిన పండ్లు,కూరగాయలను తినకూడదని,వేడి ఆహార పదార్థాలను తినాలని సూచించారు.ఏ విధమైన అనారోగ్యం కనిపించిన సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్నిగాని ఆరోగ్య కార్యకర్తనుగాని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం శేఖర్,డాక్టర్ మధుమతి,ఎంఎల్ హెచ్ పి వశ్రిత,సరస్వతి,శ్రీనివాస్,ఊర్మిళ,ఉపాధ్యాయులు,ఆశాలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.