26-07-2025 09:57:32 AM
హైదరాబాద్: మెహదీపట్నం ఆర్టీసీ డిపో(Mehdipatnam RTC Depot) ముందు ఉన్న ఫంక్షన్ హాల్ వద్ద శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్(Telangana Housing Board Corporation)కు చెందిన అధికారులతో వాగ్వాదం జరిగింది. అధికారులు, మెహదీపట్నం ఫంక్షన్ హాల్ యాజమాన్యం మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్. జగదీశ్వర్ రావు స్పృహతప్పి పడిపోయారు. జగదీశ్వర్ రావును తొటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం(Function hall management) గత ఎనిమిది ఏళ్లుగా హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించలేదు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఇప్పటి వరకు మొత్తం కోటి యాభై లక్షల వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్న అధికారులు శనివారం నాడు సీజ్ చేసేందుకు వెళ్లారు. సీజ్ చేసే క్రమంలోనే తోపులాట జరిగి అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ మృత్యువాత పడ్డారు. అధికారుల సమాచారం తో ఘటనాస్థలికి చేరుకున్న మెహదీపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.