24-02-2026 01:29:45 AM
40 రోజులుగా పరారీ.. దేశ విదేశాల్లో చక్కర్లు
పోలీసుల పక్కా స్కెచ్
హైదరాబాద్, ఫిబ్రవరి౨౩ (విజయక్రాంతి): రూ.547 కోట్ల సైబర్‌క్రైమ్ కేసులో 40 రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుల్లో ఒకడైన ఉడతనేని వికాస్‌చౌదరిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పోలీసుల కళ్లగప్పి వికాస్ చౌదరి దేశ విదేశాలు తిరుగుతుండగా, సోమవారం పక్కా స్కెచ్‌తో మాటు వేసి హైదరాబాద్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితు డికి చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను, రెండు విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారి స్తున్నారు.
ఈ భారీసైబర్‌క్రైం జనవరిలో వెలుగు చూసింది. డిసెంబర్ 24 న ఖమ్మం సత్తుపల్లి మం డలం తుంబూ రు గ్రామానికి చెందిన మోదుగ సాయికిరణ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. సత్తుపల్లితోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యే క ఆపరేషన్ చేపట్టి సైబర్ క్రైంతో లింకులు ఉన్న వారిని గుర్తించారు. దీని వెనుక సూత్రధారులు వికాస్‌చౌదరి, పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కల్యాణ్ తేల్చారు. వీరిలో పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కల్యాణ్ పో లీసులకు పట్టుబడగా, వికాస్ చౌదరి పరారీలో ఉన్నాడు.
అలాగే ఇదే కేసులో పోలీసులు 18 మంది నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం సీపీ సునీల్ దత్ దీనికి సంబంధించిన వివరాలు సైతం మీడియాకు వెల్లడించారు. నిందితులు మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా మొత్తం రూ.547 కోట్ల లావాదేవీలు చేశారని స్పష్టం చేశారు. వికాస్ చౌదరి ఖాతాకు రూ.80.41 కోట్లు మళ్లించుకుని, తర్వాత భార్య భానుప్రియ ఖాతాలో రూ.45.62 కోట్లు, బావమరిది మేడ సతీష్ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి అనే మహిళ ఖాతాలో రూ. 81.72 కోట్లు, కరీంనగర్‌కు చెందిన తాటికొండ రాజు ఖాతాలో రూ.92.54 కోట్లు..
మొత్తం గా రూ.435.73 కోట్లు మళ్లించాడని పోలీసులు గుర్తించారు. నిందితులు వాడిన 150 కి పైగా బ్యాంక్ ఖాతాలను సోమవారం పూ ర్తిగా ఫ్రీజ్‌చేశారు. మరో ప్రధానసూత్రధారుడు మనోజ్‌కల్యాణ్ కొల్లగొట్టిన సొ మ్ము నంతా క్రిప్టోకరెన్సీగా మార్చి, హైదరాబాద్‌లోని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బినా మీల పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధాంచారు. నిందితుల అంతర్జాతీయ సంబంధా లపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులోకి ఈడీ ఎంటరయ్యే అకాశాలు ఉన్నాయి.