పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి
నాగోల్, ఆగస్టు 25 (విజయక్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని కమర్షియల్ టాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ను సందర్శించిన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మెహతాను కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై ఆయనతో చర్చించారు.
కమర్షియల్ టాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో పెండింగ్లో ఉన్న పనులతో పాటు కొత్తపేట గ్రామంలోని యువ చైతన్య యూత్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కుమార్ కోరారు.
అదేవిధంగా న్యూ సమతాపురి కాలనీలో రహదారి పూర్తిగా దెబ్బతి నడంతో వర్షాల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యను పరిష్కరించేందుకు నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఈఈ కార్తీక్, డీఈ విజయ్ కుమార్, ఏఈ పార్వతి తదితరులు పాల్గొన్నారు.






