28 August, 2026 | 7:31 PM

Breaking News

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •   విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి   •   మైదానంలో గంట.. ఆరోగ్యం మీ వెంట   •   పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ లను వెంటనే తెరవాలి   •   బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన   •   మహేందర్‌ను పరామర్శించిన సునీల్ రావు   •   మందకృష్ణ మాదిగ పోరాటంతోనే వికలాంగులకు హక్కుల సాధన   •   ఆల్లాపూర్ ఎక్స్ రోడ్ లో స్వీట్ హార్ట్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం   •  

పింఛన్ ఖాతాల్లో 1,500 కోట్లు

14-07-2026 12:00 AM
  1. బీహారీ తండ్రీకొడుకులకు బిగ్ షాక్
  2. అంతడబ్బు ఎలా వచ్చిందో తెలియక అయోమయం

పాట్నా, జూలై ౧౩: వృద్ధాప్య పెన్షన్ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లిన ఓ వృద్ధుడికి, దివ్యాంగుడైన అతడి కుమారుడికి షాకింగ్ విషయం తెలిసి అవాక్కయ్యారు. తమ రెండు ఖాతాల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.1500 కోట్లకు నగదు ఉన్నట్లు విని నివ్వెరబోయారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఆదివారం ఈ విచిత్రమైన ఘటన జరిగింది.

ఇంతకీ విషయమేమిటంటే.. కామేశ్వర్ మిశ్రా అనే 82 ఏళ్ల వృద్ధుడు పింఛను సొమ్ము తీసుకునేందుకు దివ్యాంగుడైన తన కుమారుడితో కలిసి స్థానిక కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ)కి వెళ్లాడు. సిబ్బంది తన ఖాతాలో రూ.759 కోట్లు ఉన్నట్లు చెప్పారు. అలాగే, దివ్యాంగుడైన కుమారుడి ఖాతాను కూడా తనిఖీ చేయించగా, ఆ ఖాతాలోనూ రూ.౭౫౯ కోట్లు ఉన్న ట్లు వెల్లడించారు.

ఆ ఊహించని పరిణామానికి తండ్రీకొడుకులు ఒకింత ఆశ్చర్యానికి, అంత డబ్బు ఎలా జమ అయిందో తెలియక ఆందోళనకూ గురయ్యారు. వ్యవహారంపై బ్యాంక్ అధికారులు, ప్రభు త్వాధికారులు స్పందించి తగిన దర్యాప్తు చేపట్టాలని కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే, ఇలా రెండు ఖాతాల్లో అంతమొత్తంలో నగదు జమ అయింటుందని నిపుణులు చెప్తున్నారు.