12-08-2025 06:51:35 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం..
చండూరు (విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీలో మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM District Secretary Group Member Banda Srisailam) అన్నారు. మంగళవారం ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా చండూరు మున్సిపాలిటీలో హరిచంద్ర నగర్ కాలనీలో మురికి కాల్వను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మురికి కాల్వలు సరిగ్గా లేకపోవడం వలన ఈగలు, దోమలు ఇండ్లలోకి ప్రవేశించడం వలన వర్షాలు కురవడంతో సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. చండూరు మున్సిపాలిటీలో కొన్ని కాలనీలో వర్షాలు రావడంతో రోడ్డుగుంతల మయంగా మారుతుందని ఆయన అన్నారు. చండూర్ లోని ప్రధాన రహదారి ప్రజలకు అసౌకర్యంగా ఉందని, గుంతలు ఉండటంవల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, చండూర్ లోని ప్రధాన రహదారి రోడ్డు యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని అయన అన్నారు.
చండూరు బస్టాండ్ ఆవరణలో వర్షాలు రావడంతో బురదమయంగా మారిందని, దోమలు, ఈగలు విజృంభిస్తున్న మున్సిపాలిటీ అధికారులు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే మురికి కాలువ కాల్వల నిర్మాణం చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా భావద్వేగాలను రెచ్చగొడుతూ విధ్వంసం పాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడం వలన మున్సిపాలిటీలో గాని, గ్రామాల్లో గాని ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మురికి కాల్వల మరమత్తు పనులు వెంటనే చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, మొగుదాల వెంకటేశం, తాందరి యాదయ్య, కే. యాదయ్య తదితరులు పాల్గొన్నారు.