calender_icon.png 13 August, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోయ వీరాపురంలో వైద్య శిబిరం

12-08-2025 06:43:25 PM

వాజేడు (విజయక్రాంతి): వాజేడు మండల(Vajedu Mandal) పరిధిలో గల కోయవీరాపురం గ్రామంలో మంగళవారం వాజేడు పిహెచ్సి వైద్యులు యోషిత ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి ఫీవర్ సర్వే చేశారు. ఇంటి ఆవరణంలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచన చేస్తూ గోలాలలో గల మురుగునీటిని పారబోశారు. వైద్య శిబిరంలో 35 మందికి పరీక్షించగా 8 మందికి జ్వరం గుర్తించి తగిన మందులు పంపిణీ చేశారు. పదిమందికి రక్త పరీక్షలు చేయగా ఒకరికి ఆర్డిటి పాజిటివ్ రాగ తగిన వైద్యం చేశారు. ఈ కార్యక్రమంలో  స్టాఫ్ నర్స్ అనూష, హెచ్ ఏ చిన్న వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం నాగేంద్ర కుమారి, లలిత ఆశ వర్కర్లు పాల్గొన్నారు.