calender_icon.png 15 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు పట్టం

15-11-2025 02:07:11 AM

  1. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం
  2. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
  3. జూబ్లీహిల్స్ ఫలితంపై పీసీసీ అధ్యక్షుడు హర్షం

నిజామాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): జూబ్ల్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సం క్షేమానికి పట్టం కట్టారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజా ప్ర భుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ప్రజ లు జూబ్లీహిల్స్‌లో అత్యధిక మెజారిటీతో కాం గ్రెస్ అభ్యర్థిని గెలిపించారన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు.

కాంగ్రెస్‌పై, రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ఉన్న నమ్మకంతో ప్రజలు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్ర భుత్వం చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ విజయానికి ముఖ్య కారణం అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రణాళిక బద్దంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ కార్యకర్తలు అంతా కలిసి ఉపఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారన్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ కా ర్యకర్తలు అధికంగా కష్టపడ్డారన్నారు.వివిధ అభివృద్ధి పథకాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో మెట్రో రైలుమార్గంతో పా టు మూసీ సుందరీకరణ పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ వైపు నిలిచి అ త్యధిక మెజార్టీని ఇచ్చారన్నారు.బీఆర్‌ఎస్‌కు మనుగడ లేదని జూబ్లీహిల్స్ తాజా తీర్పుతో స్పష్టమైందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నా రు.

ఎన్నికల ప్రచారంలో బీరాలు పలికిన బీ ఆర్‌ఎస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. వచ్చే మూడేళ్లలోనూ జనరంజక పాలన అందిస్తూ వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీరిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తామని ఆయన స్పష్టం చే శారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆశయాలను సా ధిస్తూ రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 

జూబ్లీహిల్స్ విజయం జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నాంది పలుకుతూ, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మె ల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, ఆర్ట్టీఏ సభ్యుడు నరేందర్ గౌడ్, ప్రముఖ న్యాయవాది దయాకర్ గౌడ్ పాల్గొన్నారు.