27 మంది సజీవ సమాధి
బ్యాంకాక్ పబ్‌లో అగ్నిప్రమాదం
7౦ మందికి పైగా క్షతగాత్రులు
25 మంది పరిస్థితి విషమం
- ప్రమాదానికి కారణం షార్ట్‌సర్క్యూట్
- ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు టాయిలెట్లలోకి పరుగులు
- టాయిలెట్లలో శవాల గుట్టలు గుర్తింపు
బ్యాంకాక్, జూలై ౧౩: అప్పటివరకూ వారంతా ఆటపాటలతో ఆనందంగా గడిపారు. సంగీతకారులు లైవ్‌మ్యూజిక్ నడుపుతుండగా ఉల్లాసంగా సందడి చేస్తున్నారు. ఇంతలోనే మృత్యువుకు కన్నుకుట్టిందో ఏ మో.. అగ్నిప్రమాదం రూపంలో వచ్చి వా రిని కబళించింది. ఆ అగ్నికీలలు ౨౭ మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక పబ్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 27 మంది సజీవదహనమయ్యారు.
మరో 70 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. భారత కాలమానం ప్రకా రం రాత్రి 1౧:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సంభవించిన వేళ అగ్నికీలలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రాణాలు దక్కించుకునేం దుకు కొందరు టాయిలెట్లలోకి వెళ్లారు. సోమవారం ఉదయం రెస్క్యూ సిబ్బంది బాత్‌రూం తలుపు తీసి చూడగా శవాలగుట్టలు కనిపించాయి.
బ్యాంకాక్ చాతుచక్ ప్రాంతంలోని ‘రంగ్ బీర్ నా లాట్ ప్రావ్’ పబ్ వారాంతం స్థానికులు, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. పబ్ సామర్థ్యం ౩౦౦ కాగా, అగ్నిప్రమాదానికి ముందు 250 మంది వరకూ వచ్చారు. సంగీతకారులు లైవ్ మ్యూజిక్ ప్రారంభించగా, కొద్ది సేపటి తర్వాత షార్ట్‌సర్క్యూట్ సంభవించి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి పబ్‌ను దట్టమైన పొగ కమ్మేసింది. భయంతో ఎంతోమంది బయటకు పరుగులు తీశారు.
తర్వాత కొద్దిక్షణా ల్లోనే ఈ క్రమంగా మంటలు పబ్ అంతా వ్యాపించాయి. అలంకరణకు వాడిన ఫైబర్, ప్లాస్టిక్, సౌండ్ ప్రూఫింగ్ ఫోం కారణంగా పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. ద్వారా లను సైతం మంటలు దహిస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పబ్‌లో నాలుగు అత్యవసర ద్వారాలు ఉన్నప్పటికీ, అలజడిలో అవి సకాలంలో తెరుచుకోలేదు.
దట్టమైన నల్లటి పొగ కారణంగా కళ్లు కనిపించక, శ్వాస తీసుకోలేక కొందరు పబ్ వెనుకకు పరుగులు తీశారు. అక్కడి టాయిలెట్లలోకి తలుపులు పెట్టుకున్నారు. లోపల ఉన్నవారికి దుస్తులకు, ఒంటికి మంటలు అంటుకుని భయంతో బయటకు వచ్చిన కొందరిని స్థానిక ట్యాక్సీడ్రైవర్లు కాపాడారు. మంటలు ఆర్పి వారిని, ప్రమాద స్థలానికి దూరంగా తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు.
అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులను అత్యవసవర వైద్యచికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించా రు. టాయిలెట్లు తెరిచి చూడగా, వాటిలో శవాల గుట్టలు కనిపించాయి. ఘటనా స్థలంలో మొత్తం ౨౭ మృతదేహాలను గుర్తించారు. అగ్నిప్రమాదంలో మొత్తంగా ౨౭ మంది మృతిచెందినట్లు నిర్ధారణకు వచ్చా రు. మరో ౭౦ మందికి పైగా క్షతగాత్రులైనట్లు వెల్లడించారు.
మృతుల్లో ఎక్కువ మంది పొగకు తాళలేక, ఊపిరి పీల్చుకోలేకే వల్లే చనిపోయినట్లు గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది 25- 50 ఏళ్ల వయస్సులోపు వారేనని తెలిపారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల్లో ‘తొస్సకాన్’ అనే మ్యూజిక్ బ్యాం డ్ సింగర్ బ్రీజ్, కీబోర్డ్ ఆర్టిస్ట్ క్వాంగ్ కూడా ఉన్నారు. ఘటనపై థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్, బ్యాంకాక్ గవర్నర్ చాట్‌చార్ట్ సిట్టిపుంట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని తెలిపారు. క్షతగా త్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. 2009లో బ్యాంకాక్‌లోని సాంతి కా క్లబ్‌లో ఇదే తరహా అగ్నిప్రమాదం జరిగింది. నాడు ౬౬ మంది మృతిచెందారు. ౧౭ ఏళ్ల తర్వాత మళ్లీ చాత్‌చుక్ ప్రాంతంలో మళ్లీ అతిపెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.






