14-05-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 13: కల్తీ మద్యం తాగి పంజాబ్‌లో 14 మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌సర్‌లోని మజితా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు.
మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్యలు తీసుకొని ప్రధాన నిందితుడైన ప్రబ్జీత్‌సింగ్‌తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో సహబ్‌సింగ్ అనే మరో నిందితుడి పేరు వెల్లడైంది. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎక్కడి నుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఇదే మద్యం తాగిన మరికొందరిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.