14-05-2025 12:00:00 AM
ఢాకా, మే 13: బంగ్లాదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నా యి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక ఆ పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
ఆయన తెల్లవారుజా మున 3 గంటల సమయంలో థాయ్‌లాండ్ విమానమెక్కినట్టు సమాచారం. దీంతో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. గతవారం ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హ మీద్ థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ప్ర యాణించినట్టు కథనాలు వెలువడ్డాయి. హ మీద్ వెంట అతడి సోదరుడు, బావ కూడా ఉన్నట్టు సమాచారం.
హమీద్ లుంగీ ధరిం చి విమానాశ్రయానికి వచ్చినట్టుగా ఉన్న దృ శ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనపై యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్ర భుత్వం సీరియస్‌గా స్పందించింది. వెంటనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యా ప్తు చేపట్టింది.
ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వస్తున్న ఆరోపణలపై ఇప్పటికే కొంతమంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేయగా, మరికొందరిని బదిలీ చే శారు. అవామీ లీగ్ విద్యార్థి విభాగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అబ్దుల్ హమీద్ పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. షేక్ హ సీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2013 నుంచి 2023 వరకు రెండుసార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.