ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలే
05-06-2024 12:58 AM
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదని అందుకే మరోసారి బీజేపీకి పట్టం కట్టారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించలేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విజ యం మోదీ విజయంగా ఆయన అభివర్ణించా రు. కేవలం 6 నెలల్లోనూ రేవంత్ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు తన పాలనకు రెఫరెం డం అని చెప్పిన సీఎం ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణలో తొలిసారి 8 ఎంపీ స్థానాలు కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీదేనని అన్నారు.






