11-11-2025 01:16:57 AM
సిద్దిపేట క్రైమ్, నవంబర్ 10 : మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందికి న్యాయమూర్తి రూ.లక్షా 51వేల జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలతోపాటు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 15 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. సోమవారం వారిని సిద్దిపేట ఒకటవ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి.తరణి ముందు హాజరుపరచగా జరిమానా విధించారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రవీణ్ కుమార్ సూచించారు.