11-11-2025 01:19:12 AM
‘ ప్రజావాణిలో పిర్యాదు చేసిన గ్రామస్తులు
సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:10కొండపాక మండలందుద్దేడ గ్రామంలో ఇళ్ల మధ్యనే నడుస్తున్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని గ్రామ పెద్దలు, మహిళలు కలిసి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.గృహాల మధ్య కొనసాగుతున్న ఈ దుకాణాల వల్ల మహిళలు, విద్యార్థులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దుకాణాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు పెరగడంతో గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందని గ్రామస్థులు తెలిపారు.
.జిల్లా కలెక్టర్ కె.హైమవతి మద్యం దుకాణమును గ్రామం బయటకు తరలించేలా చర్యలు తీసుకావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 200 అర్జీలు అందాయి.దరఖాస్తులను వెంటనే పరిష్కరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్,డిఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.