11-11-2025 01:15:10 AM
ధాన్యంతో పాటు మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో వేగం పెంచాలి
అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమీక్ష
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గతేడాది ఇదే సమయంలో 3.94 లక్ష ల టన్నులు కొనుగోలు జరిగిందన్నారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయాబిన్ ఇతర పంటల కొనుగోలుపై సోమవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు, సి విల్ సప్లయ్ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లయ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్ష నిర్వహించారు.
వాతావరణ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్ర మత్తంగా ఉండాలని, ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఇప్పటి వరకు 3.95 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 4.59 లక్షల మెట్రిక్ టన్నుల పెద్ద ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతుల సంఖ్య గత సంవత్సరం 55,493 మందిగా ఉండగా, ఈ ఏడాది 1,21,960 మందికి చేరిందని చెప్పారు.
మొత్తం ధాన్యం కొనుగో లు విలువ రూ. 2,041.44 కోట్లు కాగా, ఇది గత సంవత్సరం రూ. 915.05 కోట్లతో పోలిస్తే రెట్టింపుగా ఉందని, ఇందులో రూ. 832.90 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా, మిగిలిన రూ. 1,208.54 కోట్లు ఆన్ లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్ట మ్ (ఓపీఎంఎస్) ద్వారా నమోదు తర్వాత 48 గంటల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. సన్నా ల బోనస్ మొత్తం గత సంవత్సరం రూ. 43. 02 కోట్లు అని, ఇప్పుడు రూ. 197.73 కో ట్లకు పెరిగిందని, అందులో రూ. 35.72 కో ట్లు ఇప్పటి వరకు చెల్లించామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
‘పత్తి’ పరిమితిని కేంద్రం ఎత్తివేయాలి: మంత్రి తుమ్మల
మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ప్ర భుత్వం ఎకరాకు 18.8 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్లకు పెంచడంపై రైతులు సంతోషం గా ఉన్నారని, పత్తి కొనుగోళ్ల విషయం లో సీసీఐ కొత్త ఎల్1, ఎల్2 నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొం టు న్నారని కలెక్టర్లు వివరించగా మంత్రి తుమ్మ ల స్పందిస్తూ పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 7 క్వింటాళ్ల నుండి 12 క్వింటాళ్లకు పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నా రు.
వర్షాల కారణంగా రంగు మారిన సో యాబీన్ పంటను కూడా కొనుగోలు చేయడానికి అనుమతించాలంటూ కేంద్రానికి రా ష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా సుమా రు 1.10 లక్షల ఎకరాలలో ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని, వ్యవసాయ శాఖ రూపొందించిన పంటనష్టం నివేదికను కేంద్రానికి పంపామని, ప్ర స్తుత వాతావరణ పరిస్థితుల్లో కొనుగోళ్లు సజావుగా సాగేందుకు ధాన్య తేమ శాతం నిబంధనలను సడలించమని కేంద్రాన్ని కో రామన్నారు. నాలుగు వారాల్లో మొత్తం ధాన్యం కొనుగోళ్లలో 55 శాతం జరగనుందని, అందువల్ల అన్ని శాఖలు సమన్వయం తో పని చేసి రా ష్ర్ట లక్ష్యం అయిన 80 లక్షల టన్నుల కొనుగోళ్లను సాధించాలన్నారు.