calender_icon.png 9 January, 2026 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రజల పత్రిక విజయక్రాంతి’

06-01-2026 01:12:26 AM

కరీంనగర్, జనవరి 5 (విజయక్రాంతి): విజయక్రాంతి దిన ప్రతిక ప్రజల పత్రిక అని, నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ గుర్తింపును పొందిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి కొనియాడారు. సోమవారం సుడా కార్యాలయంలో కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కొత్తపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల క్యాంపస్‌లో విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి క్యాలెండర్‌లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం ప్రతి వారం అందిస్తున్న విశ్లేషణాత్మక వార్తలు, వ్యాసాలు ప్రజలను ఆలో చింపజేస్తున్నాయని అన్నారు. విజయక్రాంతి దినపత్రిక మరింత మనుగడ సాధించాలని ఆకాంక్షంచారు. కార్యక్రమంలో కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్ బి విజయసింహారావు, ప్రకటనల విభాగం మేనేజర్ బరిగెల ఆంజనేయు లు, సర్క్యూలేషన్ మేనేజర్ మంచాల రాజు, క్రైం రిపోర్టర్ జి రామకృష్ణ పాల్గొన్నారు.