06-01-2026 01:14:21 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు, వినియోగంపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝు ళిపించారు. పక్షుల స్వేచ్ఛకు, అమాయక వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మా రుతున్న ఈ కిల్లర్ మాంజాను ఎవరైనా రహస్యంగా విక్రయించినా, గోదాముల్లో నిల్వ చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పం పిస్తామని హెచ్చరించారు.
దీని తయారీ, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషే ధం విధించిందని గుర్తుచేశారు. ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టాస్కుఫోర్సు, స్థానిక పోలీసులు సంయుక్తంగా పతంగుల విక్రయ కేంద్రాలు, కిరాణా షాపులు, అనుమానిత గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తారు. మాంజాను తర లించే ట్రాన్సుపోర్టు ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసులపైనా నిఘా పెట్టారు. వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే ఏజెన్సీ యజమానులపైనా కేసులు నమోదు చేయనున్నారు.