28 May, 2026 | 6:34 PM

తెలంగాణ ప్రజలు కెసిఆర్ కోరుకుంటున్నారు

28-05-2026 05:31 PM

సొంతగూటికి చేరుకున్న మాజీ సర్పంచ్ జనార్ధన్.

తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేశవపురం మాజీ సర్పంచ్ కొమ్ము జనార్ధన్ తిరిగి మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జా యుగంధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకుల గుండ గాని రాములు గౌడ్, తునికి సాయిలు గౌడ్ కలెట్లపల్లి శోభన్ బాబు, కొమ్మినేని సతీష్, యాకు నాయక్, తదితరులు పాల్గొన్నారు.