calender_icon.png 29 October, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

29-10-2025 02:19:30 PM

ఎస్సై గూగులోతు శ్రీదేవి

తరిగొప్పుల,(విజయక్రాంతి) మండలం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తరిగొప్పుల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని. ఎస్సై శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. నీటి సమీపంలో ఉండే వంతెనలు, కట్టలు దాటవద్దని, జలపాతాలు, వాగులు, చెరువులకు వెళ్ళవద్దని, ఎలక్ట్రిక్ పోళ్లు,వైర్లను తాకవద్దని సూచించారు. పాత ఇళ్లల్లో ఉండకూడదని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, రైతులు చెట్ల కింద, కరెంటు వైర్ల కింద ఉండొద్దని చెప్పారు. మొoథా తుఫాను ప్రభావంతో ప్రజలందరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.