calender_icon.png 29 October, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔదార్యం చాటుకున్న గ్రామ యువకులు

29-10-2025 02:22:31 PM

దౌల్తాబాద్‌: పాముకాటుతో మృతి చెందిన దయాకర్‌ కుటుంబానికి గ్రామ యువకులు అండగా నిలిచారు. తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన దయాకర్‌ ఇటీవల పాముకాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటనపై గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే సంకల్పంతో గ్రామ యువకులు తిర్మలాపూర్‌ సేవా సమితి వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా విరాళాలు సేకరించారు. సేకరించిన మొత్తాన్ని  గ్రామ యువకులు స్వయంగా వెళ్లి దయాకర్‌ కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.