19 April, 2026 | 6:01 AM

ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగిఉండాలి

04-06-2025 12:00 AM

నిరుపేదలకు అండగా లోక్ అధాలత్  సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.భవాని

ముత్తారం జూన్ 03(విజయ క్రాంతి); ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగి వుండాలని మంథని సీనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి వి.భవాని  పేర్కొన్నారు, మంగళవారం ముత్తారం మండలంలోని ఓడేడ్ గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన న్యా య విజ్ఞాన సదస్సు లో వారు పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు అండగా లోక్ అధాలత్ పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

బార్ అసోషియేషన్ ఉపాద్యక్షులు  కే రఘోత్తం రెడ్డి మా ట్లాడుతూ పౌరుల హక్కులు, భాద్యతలతో పాటు వివిధ చట్టాల పట్ల అవగాహన కల్పించారు, న్యాయవాది శశిభూషణ్ కాచె విత్తన చట్టం, నిషేధించబడ్డ ఎరువులు, పురుగుల మందుల చట్టా ల పై అవగాహన కల్పించారు, ఎస్.ఐ గోపతి నరేష్ మహిళల చట్టాల పట్ల అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో పిఎసిఏస్ చైర్మన్  అల్లాడి యాదగిరి రావు, లోక్ అధాలత్ సభ్యులు  కను కుంట్ల స్వామి ప్రజలుపాల్గొన్నారు.