calender_icon.png 21 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి

21-11-2025 08:57:11 PM

కుంటాల,(విజయక్రాంతి): కుంటాల సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ శుక్రవారం రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో సైబర్ నేరాల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడుతూ చేరవాణిలకు ఫోన్ వాట్సాప్ కాల్ చేస్తూ పోలీస్ రూపంలో నకిలీ గుర్తు తెలియని వ్యక్తులు నమ్మించి మోసం చేస్తారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు వాట్సప్ లోని కాల్ చేయరని, అలాంటి కాలు ఎత్తవద్దని తెలియజేశారు.

అదేవిధంగా సైబర్ నేరస్తులు గాని ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు  బ్యాంక్ పాసుబుక్ అడుగుతే ఇవ్వకూడదని దాని వలన కూడా సైబర్ మోసం చేసే అవకాశం ఉందని తెలియజేశారు. అదేవిధంగా పోలీస్ చట్టాల గురించి అవగాహన కల్పించారు పోలీస్ చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలపై సైతం అవగాహన కల్పించారు. స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు