calender_icon.png 21 November, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

21-11-2025 08:10:12 PM

జెండా ఆవిష్కరణ చేసిన గార ఆనంద్

ములుగు,మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం వేడుకలు బొడ్రాయి సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ మత్స్యకార రాష్ట్ర ఉపాధ్యక్షులు గార ఆనంద్ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం అయన మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా చేపలను పట్టుకొని అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న ఓడా బలిజ బెస్త ముదిరాజ్ మరి కొన్ని కులాల కుటుంబాలు ఈరోజు వీధినా పడ్డాయి తెలంగాణ ప్రభుత్వం తరతరాలుగా చేపల వృత్తినె నమ్ముకొని బ్రతికే మాకు చెరువుల మీద చేపలు పెట్టుకునే హక్కులను కాలరాస్తున్నారు.

చెరువుల ను నమ్ముకొని బ్రతుకుతున్న ఓడా బలిజ బెస్త ముదిరాజ్ కులస్తులను కాదని ఒక కులానికి చేపలు పట్టారాని వారికి ప్రభుత్వం చేపలు పట్టడం నేర్పి వాళ్ళ వృత్తి కానె కాదు మాకు దక్కవలసిన హక్కులను వారికీ అప్పాజెప్పడం మరి అన్యాయం ఇది ఎక్కడి న్యాయం మేము ఈ గడ్డపైన పుట్టాము ఇక్కడే బ్రతుకుతున్నాము చెరువుల పైన చేపలు పట్టుకునే హక్కులను మమ్ముల్ని కాదని వారికీ హక్కుల్ని కల్పించడం ప్రభుత్వం సొసైటీలు ఇవ్వడం సబ్సిడీలు ఇవ్వడం విడ్డురం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు దక్కవలసిన పొందవలసిన హక్కులను వేరే కులం వాళ్ళు కాలరాస్తుంటే చుస్తూ ఊరుకొం మా భూములు మా చెరువులు మా చేపలు పట్టుకునే మాకు హక్కులు మాకు దక్కెవరకు పోరాటం ఆగదు శుక్రవారం మండల కేంద్రంలో మొట్ట మొదటి సారి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను మా మత్స్యకారుల ఉద్యమానికి బీసీ సంఘాలు మద్దతు తెలపడం మాకు చాలా సంతోషం మా మత్స్యకార ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తూ చెరువుల మీద ఓడ బలిజ బెస్త ముదిరాజ్ బిడ్డలకు హక్కులను పొందే వరకు పోరాటం చేస్తామన్నారు.