21-11-2025 07:51:33 PM
చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వం నిషేధించిన పేకాటను ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని రామన్నపేట ఎస్సై డి నాగరాజు శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... రామన్నపేట గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా పేకాటను ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రామన్నపేట ఎస్ఐ ఆదేశానుసారం పోలీసు కానిస్టేబుల్ ప్రవీణ్, ప్రశాంత్, అన్వర్, రవి, మహేష్ లు
కలిసి రామన్నపేట గ్రామ శివారు ప్రాంతంలోని ఐజిఎం చర్చ్ ఎదురుగా పేకాట ఆడుతున్న రామన్నపేటకు చెందిన శివరాత్రి కుమార్(33) తండ్రి అంజయ్య, షేక్ యూసుఫ్(47) తండ్రి మధార్, చినపాక శ్రవణ్ (35)తండ్రి యాదయ్య, వెరమల్ల నర్సింహ (57)తండ్రి సైలూ, బుడ్డ లింగస్వామి(39) తండ్రి యాదయ్య లను పట్టుకొని వారి దగ్గర నుండి 3 మొబైల్ ఫోన్ లను,1820 రూపాయలను స్వాదినం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్సై డి నాగరాజు తెలిపారు.