21-11-2025 08:14:24 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ లో గ్రామంలో వికాస్ తరంగణి పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. దాదాపు 90 మందికి పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, 40 మందికి పైగా వీఐఏ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి శ్రీవాణి సహాయ సహకారాలు అందించిగా, పెద్ద పల్లికి చెందిన డాక్టర్ లీలావతి, మాధురి, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసి వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. పెద్దపల్లి వీటీ-144 మహిళా ఆరోగ్య సమన్వయకర్త సుజాత, సెంట్రల్ కమిటీ కోశాధికారి బి అశోక్ రావు, పెద్దపల్లి వికాస్ తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరానికి ముత్తారం సింగల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరి రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ సహకారాలు అందించారు.