calender_icon.png 21 November, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చెకుముకి సైన్సు పండుగ

21-11-2025 08:05:14 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల క్యాంపస్ లో జనవిజ్ఞాన వేదిక తెలంగాణ,నకిరేకల్ మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలును శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి సమక్షంలో ప్రశ్న పత్రాలను విడుదల చేశారు. పరీక్ష నిర్వహణ తీరును  ప్రధానోపాధ్యాయులైన పోతుల గోపాల్, మిర్యాల చల్మరాజు, నకిరేకల్ పట్టణ కమిషనర్ రంజిత్ పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమానికి తహసిల్దార్ స్త్రీ వైద్య నిపుణులు కె.సుష్మా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై  మాట్లాడారు మండల స్థాయిలో గెలుపొందిన జట్లకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు, జ్ఞాపికలు  అందజేశారు. ఈ సందర్భంగా సైన్స్ జాతరలో భాగంగా జిల్లా ఉపాధ్యక్షుడు వాలుగొండ వెంకటేశ్వర్లు నిర్వహించిన 'మీ చేతులతో మీ సైన్స్' కార్యక్రమం పిల్లలను ఆకట్టుకుంది.