calender_icon.png 21 November, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెపా రాష్ట్ర కార్యాలయంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

21-11-2025 07:57:42 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జవహర్ నగర్ కాలనీలోని మెపా రాష్ట్ర కార్యాలయంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి రాజేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఎగరవేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ  ప్రపంచంలోని మత్యకారులు చాలా అట్టఆడుగు స్థానంలో ఉన్నారనీ, వారి జీవనోపాధి చేపల వేట వెళ్లడం,ఎంతో ప్రమాదకరమైన జీవన విధానం, కుటుంబం రోడ్ల పైన చాపలు అమ్మడం,పండ్లు అమ్మడం చేస్తారు.ఇలాంటి అభద్రత తో జీవించే  మత్యకారులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో ఉన్న మత్యకారులకు జీవిత బీమా పథకం తీసుకొని రావాలని కోరారు.