21-11-2025 08:21:50 PM
ధర్మారం మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీ సీజ్
మైన్స్, జిల్లా జియాలజి శాఖ సహయ సంచాలకులు పి. శ్రీనివాస్
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో అక్రమ ఇసుక రవాణా చేసే వారి పట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మైన్స్ అండ్ జియాలజి శాఖ సహయ సంచాలకులు పి. శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ధర్మారం మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీ ను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. లారీ తో పాటు బ్రెజా కార్ సీజ్ చేసి ధర్మారం పోలీస్ స్టేషన్ కు అప్పగించామని అన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా కు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలకు లోబడి అనుమతి ఉన్న వారు మాత్రమే ఇసుక రవాణా చేయాలని ఆయన స్పష్టం చేశారు.