సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
15-06-2025 | 08:27pm
ఎస్సై ప్రవీణ్ కుమార్..
బెజ్జూర్ (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) అన్నారు. బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి ప్రధాన చౌరస్తాలో ప్రజలకు సిపిఆర్, సైబర్ క్రైమ్, నకిలీ విత్తనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వివాహనాలు నడపరాదని వాహనదారులకు సూచించారు. వాహనదారులు వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. అతివేగంతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు.






