14 July, 2026 | 6:25 PM

Breaking News

భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •  

ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

28-04-2025 12:55 AM

సూర్యాపేట, ఏప్రిల్ 27: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎస్పీ పార్థసారథి సూచించారు. ఆదివారం పట్టణ పరిధిలోని భరోసా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..... పట్టణ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా డయాబెటిస్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాలను పాటిస్తూ పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకొని, వ్యాయామాలు చేస్తూ వాటిని నివారించడానికి ప్రయత్నించాలన్నారు.

ప్రజల ఆరోగ్యం కొరకు సువన్ ఫార్మా చేపడుతున్న వైద్య శిబిరాలు అభినందనీయమని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంపెనీ హెచ్ ఆర్ సీనియర్  మేనేజర్ బి వెంకటరమణ, డిప్యూటీ మేనేజర్ దుస్సా సైదులు, ఇ హెచ్ ఎస్ పివి రమణ, మెయింటెనెన్స్ ఎం శ్రీనివాసరావు, ప్రొడక్షన్ పి సతీష్, టి మధు, బి కృష్ణ,  జీవన్ నాయక్, ఓ హెచ్ సి డి విజయ, బెల్లి విజయ,  సువేన్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.