calender_icon.png 7 September, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

05-09-2025 12:00:00 AM

బీఎన్ రెడ్డి డివిజన్‌లో జలమండలి అధికారుల పర్యటన 

ఎల్బీనగర్, సెప్టెంబర్ 4 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని జలమండలి అధికారులు హామీ ఇచ్చారు. గురువారం జలమండలి, అటవీ శాఖల అధికారులు వివిధ కాలనీల్లో పర్యటించి, సమస్యలను పరిశీలించారు.

సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ నుంచి హరిహరాపురం వరకు డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ లచ్చిరెడ్డి బుధవారం చేపట్టిన రాస్తారోకో, జలమండలి కార్యాలయంలో నిర్వహించిన వంట వార్పు కార్యక్రమానికి అధికారులు స్పందించారు.  డ్రైనేజీ సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని జలమండలి డైరెక్టర్ శ్రీధర్, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ ఈఈ రమేష్ బాబు, కార్పొరేటర్ లచ్చిరెడ్డితో కలిసి సాగర్ కాంప్లెక్స్ లోని కల్వర్టును పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్య శాశ్వత పరిష్కారమయ్యే విధంగా ప్రణాళిక రూపొందించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.  అధికారులు సమన్వయంతో పనులు ప్రారంభించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్ కోరారు. అనంతరం గుర్రంగూడలోని అటవీ శాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డితో సమావేశమై, అటవీశాఖ అధికారులు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, జలమండలి సీజీఎం నాగేందర్, జీఎం బలరాంరాజు, మహేందర్, వనస్థలిపురం సీఐ మహేశ్ గౌడ్, ఎస్త్స్ర రవి నాయక్, డీఈ దామోదర్, డీజీఎం రాజగోపాల్, రవీంద్రనాథ్ వర్మ, మేనేజర్ సిరివెన్నెల, సత్యనారాయణ, ఏఈ కార్తీక్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.