05-09-2025 12:00:00 AM
మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి
మేడ్చల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఏసిపి శంకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో వినాయక విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సాహం విషాదాంతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నిమజ్జనం సందర్భంగా నిబంధనలు పాటించి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలన్నారు. ఆధ్యాత్మికం మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, చిన్నారుల అన్నమయ్య కీర్తనలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులు, నిర్వాహకులు 108 ప్రసాదాలను సమర్పించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులను ఎసిపి శంకర్ రెడ్డి అభినందించారు. చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు.