calender_icon.png 5 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాలీలు, మౌత్ స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

05-12-2025 01:45:40 AM

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై అభ్యర్థులకు అవగాహన సదస్సు

తుంగతుర్తి, డిసెంబర్ 4: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా విధానాలు) పై అభ్యర్థులు, ప్రతినిధులకు అవగాహన కల్పిస్తూ గురువారం మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తహసీల్దార్ ఉదయానందం ఎంపీడీవో, శేషు కుమార్ సిఐ నరసింహారావు ఎస్త్స్ర క్రాంతి లు మాట్లాడారు.

ఎన్నికల సమయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టరాదని, వాగ్దానాలు చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం, డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.ప్రచారం సమయంలో అనుమతుల మేరకే మైక్ సెట్లు, వాహనాలు ఉపయోగించాలని, సోషల్ మీడియాలో కూడా ఉద్రిక్తత కలిగించే పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు.

అర్హులందరూ నిబంధనలు పాటించి ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని సూచించారు బైండోవర్ అయిన అనంతరం ఎన్నికల నియామ నిబంధనలు పాటించకున్నట్లయితే 5,00,000 వరకు జరిమానా వేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా ఇస్తా రాజ్యాంగ వాడవద్దని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.