4 May, 2026 | 3:17 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులకు అనుమతులు ఇవ్వాలి

13-03-2026 12:21 AM

మానుకోట ఎంపీ బలరాం నాయక్ 

మహబూబాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, మహబూబాబాద్ జిల్లా కేంద్రం, డోర్నకల్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు పనులకు కేంద్రం అనుమతి మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కలిసి విజ్ఞప్తి చేశారు.

గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన రహదారుల అంశంపై కేంద్ర మంత్రితో ఎంపీ చర్చించినట్లు చెప్పారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తపరిచినట్లు ఎంపీ తెలిపారు. ఎంపీ వెంట నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు.