పర్యాటక ప్రదేశాల పరిశుభ్రతకు ప్రాధాన్యం
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ
వెంకటాపూర్, మార్చి 12 (విజయక్రాంతి):పర్యాటక ప్రదేశాల పరిశుభ్రతకు ప్రాధాన్యమని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ అన్నారు. మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప చెరువు బోటింగ్ పాయింట్ వద్ద గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, సి.ఆర్.ఎం.వై ఆర్కే రాజు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమని తెలిపారు.
పర్యాటక ప్రాంతాలు అందంగా, పరిశుభ్రంగా ఉన్నప్పుడే పర్యాటకులను ఆకర్షిస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ పర్యాటక ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ టిడీసీ ఏఈ విజయ్ కుమార్, టూరిజం గైడ్లు గోరంటాల విజయ్ కుమార్, వెంకటేష్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, ధశరథం, బోటింగ్ ఇంచార్జి సాంబయ్య, డ్రైవర్లు గోపాల్ స్వామి, సదానందం, కారోబార్ రవి, గ్రామపంచాయతీ సిబ్బందిలు, హరిత హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




