29-10-2024 06:16:15 PM
జనగామ (విజయక్రాంతి): దీపావళిని పురస్కరించుకుని పటాకుల షాపులు ఏర్పాటు చేయదలిచే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలని జనగామ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ దామోదర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం మాత్రమే బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దుకాణంలో కచ్చితంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధలను అతిక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.