పర్సన్ ఆఫ్ ది ఇయర్ ట్రంప్
మరోసారి ఎంపిక చేసిన టైమ్ మ్యాగజైన్?
వాషింగ్టన్, డిసెంబర్ 12: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టైమ్ మ్యాగజైన్ అవార్డుకు ఎంపికైనట్లు తెలిసింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తులకు ప్రతి ఏటా ఈ అవార్డులను టైమ్ మ్యాగజైన్ అం దజేస్తుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ట్రంప్‌ను ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు టైమ్ మ్యాగజైన్ ఎంపికచేసినట్లు పలు వార్తా సంస్థలు తెలిపాయి. అయితే ఈ కథనాలపై టైమ్ మ్యాగజైన్ స్పందించలేదు. గతంలో 2016లో మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికై వైట్‌హౌజ్‌కు వెళ్లినపుడు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ట్రంప్ ఎంపికయ్యారు. గత ఏడాది ఈ టైటిల్‌ను పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ అందుకున్నారు. 2019 సంవత్సరంలో జో బైడెన్, కమలా హారిస్ ఎంపికయ్యారు.






