08-01-2026 12:00:00 AM
మహాదేవపూర్, జనవరి 7 (విజయక్రాంతి): అఖిల భా రతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభలు జన వరి 3,4,5 తేదీలలో శంషాబాద్ కేం ద్రంగా నిర్వహించబడ్డాయి. ఈ మ హాసభల అనంతరం ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు రావుల కృష్ణ గారు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా, మహాదేవపూర్ మండలానికి చెందిన పేట సాయిను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. పేట సాయి గతంలో ఇంటర్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్గా, టౌన్ హాస్టల్స్ ఇన్చార్జ్గా, జిల్లా కోహాస్టల్స్ చార్జిగా, మహాదేవపూర్ నగర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ సందర్భంగా పేట సాయి మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియమించిన రాష్ట్ర శాఖకు, వరంగల్ విభాగ్ పెద్దలకు, తోటి కా ర్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వి ద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సాయి నియామకంపై భూపాలపల్లి జిల్లా ఏబీవీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.