08-01-2026 12:00:00 AM
పేద విద్యార్థులకు దుప్పట్లు,
గిఫ్ట్ ప్యాకెట్స్ పంపిణీ
గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవాసంస్థ
వెంకటాపురం(నూగూరు), జనవరి 7 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ, ఖమ్మం వారు వెంకటాపురం మండలంలోని జెల్లా కాలనీ, టేకులబోరు, మంగవాయి, ముక్కునురుపాలెం, రామచంద్రపురం, మొర్రవానిగూడెం, ఆలుబాక, బర్రెబొంద , ఎదిర గ్రామాలలోనీ జిటియస్ యస్ చైల్ కేర్ సెంటర్ నీ 800 మంది నీరు పెద విద్యార్ధిని విద్యార్థులకు, దుప్పట్లు, గిఫ్ట్ ప్యాకెట్లు , ఆట బొమ్మలను మొర్రవానిగూడెం జి యస్ యస్ చైల్ కేర్ సెంటర్ లో పాఠశాల ఉపాధ్యాయులు దీలిప్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను పిల్లల తల్లి తండ్రులు అభినందించారు.
మారుమూల గిరిజన ప్రాంతాలలో పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పడం, పిల్లల భవిష్యత్తుకు ఉజ్వల బాట వేయడానికి గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. పల్లె ప్రాంతాల్లో పేద విద్యార్థుల పట్ల ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు బిషప్ మారినేని జాకబ్ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణారెడ్డి, రాము, సతీష్, చైల్ కేర్ సెంటర్ సిబ్బంది ముర్రం రాజేష్, సొలోమోన్, జయరాజు, రామ్మూర్తి, యోసేపు, బాబు, సుధాకర్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.