10-01-2026 01:42:42 PM
హైదరాబాద్: జనగామ(Jangaon) చౌరస్తాలో కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఓ కాంగ్రెస్ నాయకుడి తలకు గాయాలయ్యాయి. కేటీఆర్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నాయకులు(Youth Congress leaders) రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. పురపాలక ఎన్నికలపై సన్నద్ధంపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.