వ్యవసాయ కార్మిక ఆధ్వర్యంలో ఉపాధి హామీ సమస్యలపై పీడీకి వినతి
24-04-2026 04:52 PM
చందంపేట,(విజయక్రాంతి): చందంపేట మండలం మూడు దండ్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల పరిశీలనకు వచ్చిన డీఆర్‌డీఏ జిల్లా పీడీకి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ ఈ-కేవైసీ సమస్యల వల్ల కూలీలు పనికి వెళ్లలేకపోతున్నారని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశాల్లో టెంట్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.పీడీ సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీవోలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కావలి కృష్ణయ్య ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.






