18-09-2025 08:05:01 PM
కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి..
నాగలిగిద్ద (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండల కేంద్రంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి మాట్లాడుతూ నాగలిగిద్ద మండల్ గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా వీధిదీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దసరా పండగ సమయంలో చుట్టాలు బంధువులు పండగాకి ఇంటికి వస్తారని గ్రామాల్లో 'వీధిలైట్లు లేకపోతే ఇబ్బందులకు గురి అవుతున్నారని కావున వీధి దీపాలు వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామపంచాయతీ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామపంచాయతీ కి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు ప్రభుత్వం విడుదల చేయాలని అన్నారు.